Breaking News

అందుకే సడన్‌గా రిటైర్మెంట్‌ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్‌

Published on Fri, 12/08/2023 - 19:47

ఏబీ డివిలియర్స్‌.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌.. వరల్డ్‌క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా భారత్‌లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అభిమానులు అతడిని ముద్దుగా 'మిస్టర్‌ 360' అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్‌.. 2018లో సడన్‌గా ఇంటర్ననేషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటిలో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్‌ ప్రపంచం షాక్‌కు గురైంది. అయితే తాజాగా తన అకస్మాక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్‌ వెల్లడించాడు.

"నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్‌ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్‌ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాను.

అయితే  ఇంటర్ననేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  డివిలియర్స్‌ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి