Breaking News

'భారత్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ఎటాక్‌తో బరిలోకి దిగాలి.. లేదంటే'

Published on Fri, 07/01/2022 - 13:05

కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ఎడ్జ్‌బస్టన్‌ వేదికగా శుక్రవారం(జూలై1) ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. భారత సారథ్య పగ్గాలు పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి, శార్థూల్‌ ఠాకూర్‌, రవిచంద్ర అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. జట్టులోకి  శార్దూల్ ఠాకూర్‌,  అశ్విన్‌లను ఎందుకు తీసుకోవాలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో చోప్రా వివరించాడు.

"ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలి అని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్‌ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి జడేజాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. ఒక వేళ భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే షమీ, బుమ్రా, సిరాజ్‌ల పేస్ త్రయంతో బరిలోకి దిగాలి.  అక్కడ పరిస్థితుల బట్టి ఉమశ్‌ యాదవ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

గతేడాది ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉంది. ఒక్క జో రూట్‌ తప్ప మిగితా ఆటగాళ్లు ఎవరూ అంతగా రాణించలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి అత్యుత్తమ బౌలింగ్‌ ఎటాక్‌తో బరిలోకి దిగాలి, లేదంటే భారత్‌కు గెలవడం కష్టమే అని చోప్రా యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. 
చదవండిSL vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌..!

Videos

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

Photos

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)