Breaking News

భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది

Published on Sun, 07/16/2023 - 15:14

చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 31 నుంచి ఆసియాకప్‌ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. రింకూ సింగ్‌  తిలక్‌ వర్మ, యశస్వీ జైశ్వాల్‌, ప్రభుసిమ్రాన్‌కు వంటి ఐపీఎల్‌ హీరోలకు చోటు దక్కింది. 

వీరితోపాటు ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జట్టుకు యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారధ్యం వహించనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టుపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. ఈ జట్టులో మిస్టరీ స్పిన్నర్‌  వరుణ్ చక్రవర్తిను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన అతిపెద్ద తప్పిదమని చోప్రా అభిప్రాయపడ్డాడు.

"ఆసియాక్రీడలకు భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపికచేశారు. రింకూ, జైశ్వాల్‌, ప్రభుసిమ్రాన్‌ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జట్టులో వరుణ్‌ చక్రవర్తికి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మాత్రం సెలెక్టర్లు మాత్రం పెద్ద తప్పు చేశారు.

అతడు ప్రపంచంలోనే అత్యుతమ స్పిన్నర్లలో ఒకడు. అతడికి టీ20 ప్రపంచకప్‌-2021 జట్టులో అవకాశం ఇచ్చారు. అక్కడ విఫలమకావడంతో పూర్తిగా అతడిని పక్కన పెట్టేశారు. వరుణ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా రాణించాడు. కాబట్టి అతడు చైనాకు వెళ్లే భారత జట్టులో ఉండాల్సింది" అని తన యూట్యూబ్‌ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: Duleep Trophy: ప్రియాంక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్‌ జోన్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి