Breaking News

మాగ్నస్ కార్ల్‌సెన్‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన 9 ఏళ్ల ఢిల్లీ బాలుడు

Published on Wed, 06/25/2025 - 14:01

ప్ర‌పంచ చెస్ నంబ‌ర్ వ‌న్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల ఆరిత్ క‌పిల్ చెమ‌ట‌లు ప‌ట్టించాడు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో జరిగిన 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే' చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌ను ఆరిత్ ఓడించినంత ప‌నిచేశాడు.

తొమ్మిదేళ్ల అరిత్‌ ఎత్తుల ముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్‌సెన్ త‌డ‌బ‌డ్డాడు. అయితే ఆఖ‌రి రౌండ్‌లో స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండంతో క‌పిల్ తనకు ల‌భించిన అవ‌కాశాన్ని ఉప‌యెగించుకోలేక‌పోయాడు. దీంతో గేమ్ డ్రాగా ముగిసింది.

ఆరిత్ ఈ ఈవెంట్‌లో జార్జియా నుంచి పాల్గోన్నాడు. అత‌డు ప్ర‌స్తుతం జార్జియా వేదిక‌గా జ‌రుగుతున్న అండర్-10 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీప‌డుతున్నాడు. ఇప్ప‌టికే రెండు రౌండ్ల‌లో విజ‌యం సాధించిన అరిత్‌..బుధవారం తన మూడవ గేమ్ ఆడనున్నాడు. అంతకుముందు అండర్-9 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రన్నరప్‌గా ఆరిత్‌ నిలిచాడు.

మరోవైపు భారత్‌కు చెందిన వి. ప్రణవ్ 10 పాయింట్లతో ఈ  'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే' టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హాన్స్ మోక్ నీమాన్ , కార్ల్‌సెన్ ఇద్దరూ 9.5 పాయింట్లతో ముగించారు. కానీ టైబ్రేక్‌లో నీమాన్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.
చదవండి: అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)