Breaking News

నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక

Published on Fri, 06/02/2023 - 19:08

సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో  పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్‌లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. 

 పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు.  జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు.

రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్‌ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి  ప్రకటించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)