దినేష్‌ కార్తీక్‌కు బిగ్‌ షాక్‌ ఇవ్వనున్న ఆర్సీబీ.. అతడితో పాటు!

Published on Mon, 06/19/2023 - 11:39

ఐపీఎల్‌-2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్‌లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-16వ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్‌ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్‌ హాజిల్‌ వుడ్‌, ఫిన్‌ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

ఆ సీజన్‌లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్‌నెస్‌ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది.
చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్‌

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)