Breaking News

ప్రపంచకప్‌లో అదుర్స్‌.. ఇదో చారిత్రక ఘట్టం: భారత చెస్‌ దిగ్గజం

Published on Wed, 08/16/2023 - 10:29

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచ కప్‌ చెస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్‌ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్‌. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్‌ చేరతాడు.

తొలి గేమ్‌లు డ్రా
మరో క్వార్టర్స్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్‌ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్‌ 48 ఎత్తులో గుకేశ్‌ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్‌ ఫైనల్‌ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.

విదిత్‌ గుజరాతీ (భారత్‌), నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌ బైజాన్‌) మధ్య గేమ్‌ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్‌ డొమినెగ్వెజ్‌ పెరెజ్‌ (అమెరికా) మధ్య గేమ్‌ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి.  

ఇదో చారిత్రక ఘట్టం
మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్‌ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్‌ అభిప్రాయ పడ్డాడు.    

చదవండి: టీమిండియాతో సిరీస్‌ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్‌ తర్వాత కెప్టెన్‌ అతడే!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)