Breaking News

Olympics: నెలసరి మూడో రోజు.. వీక్‌నెస్‌ వల్ల: మీరాబాయి చాను

Published on Thu, 08/08/2024 - 14:04

‘‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కోచ్‌ చెప్పినట్లుగా చేశాను. పతకం సాధించలేకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. గాయం నుంచి కోలుకునే క్రమంలో తక్కువ సమయమే దొరికినా దానిని సద్వినియోగం చేసుకోగలిగాను.

85 కిలోల బరువు ఎత్తడం కోసం ఎంతగానో ప్రాక్టీస్‌ చేశా. కాంపిటీషన్‌ సమయంలోనూ పొరపాట్లకు తావివ్వలేదు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విషయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నిజానికి.. పోటీకి సిద్ధమవుతున్నపుడే నా నెలసరి మొదలైంది.

ఇది మూడోరోజు. అది కూడా ప్రభావం చూపింది. వీక్‌నెస్‌ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. దేశం కోసం పతకం గెలవాలని ఎంతగానో కృషి చేశాను. అయినా.. ఆటలో గెలుపోటములు భాగమే. వచ్చే ఒలింపిక్స్‌ కోసం మరింత కష్టపడతా. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందిస్తా’’ అంటూ భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఉద్వేగానికి లోనైంది.

నాలుగోస్థానంతో సరి
ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో మీరాబాయి తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ మణిపూర్‌ ఆణిముత్యం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఫలితంగా కాంస్య పతకం చేజారింది. 

ఫైనల్లో 12 మంది పోటీపడగా.. మీరాబాయి మొత్తం 199 కేజీల బరువు మాత్రమే ఎత్తగలిగింది. స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్‌ అండ్‌ జెర్క్‌ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.

ఇక ఈ విభాగంలో చైనా వెయిట్‌లిఫ్టర్‌ హు జిహుయ్‌ మొత్తం 206 కేజీల బరువెత్తి( (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు)  స్వర్ణం సాధించగా.. రొమేనియాకు చెందిన మిహేలా వలెంటీనా మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సురోద్‌చనా ఖాంబావ్‌ 200 కేజీల బరువెత్తి కాంస్యం కైవసం చేసుకుంది.

చదవండి: వినేశ్‌ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)