Breaking News

ప్రొ కబడ్డీ లీగ్‌లో 118 మంది

Published on Sat, 08/17/2024 - 04:02

ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు  రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్‌ అజిత్‌ కుమార్‌కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. 

రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్‌ ఆ రెయిడర్‌ను దక్కించుకుంది. జై భగవాన్‌ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్‌ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్‌ దాటారు. ఆల్‌రౌండర్‌ గుర్‌దీప్‌ను రూ. 59 లక్షలకు, డిఫెండర్‌ దీపక్‌ రాజేందర్‌ సింగ్‌ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్‌ పైరేట్స్‌ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్‌ అర్జున్‌ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. 

బెంగాల్‌ వారియర్స్‌ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్‌ మొహ్మద్‌ అమన్‌ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్‌ స్టువర్ట్‌ సింగ్‌ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలో 11వ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్‌ (రూ.2.15 కోట్లు; తమిళ్‌ తలైవాస్‌), మొహమ్మద్‌ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.

ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్‌ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)