Breaking News

ఈ భూమికి ఏమైంది..? వచ్చే ఏడు మరిన్ని విపత్తులే!

Published on Mon, 12/01/2025 - 04:26

వరుస భూకంపాలు. బీభత్సమైన వరదలు. కార్చిచ్చులు. అగ్నిపర్వతాల పేలుళ్లు. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం విపత్తులే. పెను ప్రాకృతిక ఉత్పాతాలే. ఈ ప్రమాదకర ధోరణి కొన్నాళ్లుగా మరీ పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా మరో నెల రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్న 2025ను అయితే 
విపత్తునామ సంవత్సరం అన్నా అతిశయోక్తి కాదేమో! దీనికితోడు, వచ్చే ఏడాది పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉంటాయన్న హెచ్చరికలు మరింత గుబులు రేపుతున్నాయి...

12 వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చేంతటి తీవ్రతతో కూడిన భారీ అగ్నిపర్వత పేలుడు ఇండోనేసియాను తాజాగా అతలాకుతలం చేసి వదిలింది. దాని 
ధాటికి చెలరేగిన బూడిద మేఘాలు భారత్, చైనా దాకా వ్యాపించాయి. వాటి తాలూకు కలకలం, భయాందోళనలు ఇంకా సద్దుమణగనేలేదు! అదే ఇండొనేసియా కేవలం గత 30 రోజుల్లో ఏకంగా 1,400 పై చిలుకు భూకంపాలను చవిచూసింది. ఈ వర్షాకాలంలో బెంబేలెత్తించే స్థాయి వరదలు ఇటు భారత్‌లోనూ, అటు పాక్‌లోనూ తీవ్ర విధ్వంసానికి, పంట నష్టం తదితరాలకు దారితీశాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కాలిపోర్నియా తదితర రాష్ట్రాలను పెను కార్చిచ్చులు భస్మీపటలం చేసినంత పని చేశాయి. 

ఇవి చాలవన్నట్టు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతటి తీవ్రతతో కూడిన సౌర తుఫాను భూమిని వణికించి వదిలింది. 2025లో ప్రపంచానికి చెమటలు పట్టించిన ప్రాకృతిక విపత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ ఏడాది కాలగర్భంలో కలిసేందుకు ఇంకా నెల రోజులకు పైగా ఉంది. ఈ 30 రోజుల్లో మరిన్ని విపత్తులు ముంచుకురావడం ఖాయమన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. వీటి వెనక ప్రాకృతిక నిమిత్తాలు కొన్నున్నా, ప్రధాన కారణం మాత్రమే మనిషి దురాశేనని సైంటిస్టులు మొదలుకుని పర్యావరణవేత్తల దాకా అంతా ముక్త 
కంఠంతో మొత్తుకుంటున్నారు. 

వామ్మో భూకంపాలు! 
2025ను భూకంపనామ సంవత్సరంగా కూడా చెప్పవచ్చేమో. పసిఫిక్‌లోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్, సమీప ప్రాంతాలన్నీ నిత్యం భూకంపాలతో చిగురుటాకుల్లా వణుకుతూ కాలం గడిపాయి. మార్చిలో మయన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం 5,500 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో వచ్చిన భూకంపానికి అధికారిక లెక్కల ప్రకారమే 2,500 మందికి పైగా బలయ్యారు. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అక్కడి అధికారులే అంగీకరించారు. ఇవేగాక 7కు మించిన తీవ్రతతోనే 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం మరో 10 భూకంపాలు సంభవించాయి. అంతకు తక్కువ తీవ్రతతో కూడిన వాటి సంఖ్య అయితే చెప్పనవసరమే లేదు.

అక్షరాలా ‘అగ్ని’పర్వతాలే!
ఇక అగ్నిపర్వతాల పేలుళ్లు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టాయి. గత నెలలో ఇథియోపియాలోని హైలీ గుబ్బీ అగి్నపర్వతం గత 12 వేల ఏళ్లలో తొలిసారిగా బద్దలై ఆశ్చర్యపరిచింది. దాంతో అటు ఎర్రసముద్రం నుంచి ఇటు అరేబియా దాకా విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది. అగి్నపర్వతాల పేలుళ్లకు భూకంపాలతో అతి సన్నిహిత సంబంధముందని రూర్కీ ఐఐటీలో అర్త్‌ సైన్సెస్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సందీప్‌సింగ్‌ వివరించారు. ‘‘భూకంపం వల్ల భూమి లోపలి భాగం తీవ్ర కుదుపులకు లోనవుతుంది. ఫలితంగా ద్రవ రూపంలో ఉండే మాగ్నా పైకి తన్నుకురావడం మొదలవుతుంది. దాంతో దాని చుట్టూ ఉండే రాళ్లూ తదితరాలు కుదుపులకు లోనవుతాయి. 

అగ్నిపర్వత ప్రాంతాల్లో ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. సూర్యుడు కూడా సౌరచక్ర క్రమంలో ప్రస్తుతం ఉత్కృష్ట దశకు చేరుతున్నాడు. దాంతో సౌరతుపాన్లు తరచూ వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ కూడా భూమిపై వాతావరణాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేగాక మరిన్ని ప్రాకృతిక విపత్తులకు కారణంగా మారుతున్నాయి. అంతేకాదు, రేడియో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, విద్యుత్‌ గ్రిడ్లు, అంతరిక్షంలోని ఉపగ్రహాల పనితీరు తదితరాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. అలా పలు దేశాలు భారీ ఆర్థిక నష్టాల బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

బాబోయ్‌ వరదలు! 
ఇక వరదలు, కార్చిచ్చులైతే ఈ ఏడాది ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసి వదిలాయి. భారత్, పాకిస్తాన్‌తో పాటు మలేసియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలెన్నో వీటి బారిన పడి అల్లాడాయి. అతి కొద్ది సమయంలోనే కుండపోతతో విలయం సృష్టించే క్లౌడ్‌ బరస్ట్‌లు రానురానూ ఈ దేశాల్లో పరిపాటిగా మారుతుండటం 2025లో కొట్టొచ్చినట్టుగా కన్పించిన మరో ప్రమాదకర పరిణామం. ఇవన్నీ రానున్న పెను ముప్పులకు హెచ్చరిక సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. హిమ ప్రాంతాలన్నింట్లోనూ మంచు శరవేగంగా కరిగిపోతోంది. 

తాగు, సాగు అవసరాల నిమిత్తం నదీజలాలను రిజర్వాయర్లలో వీలైనంతగా బంధించే ధోరణి ప్రపంచ దేశాలన్నింట్లోనూ నానాటికీ పెరిగిపోతోంది. వీటికి తోడు సగటు భూ ఉష్ణోగ్రతలో కూడా శరవేగంగా వృద్ధి నమోదవుతూ మరింతగా భయపెడుతోంది. పారిశ్రామికీకరణ ముందునాటితో పోలిస్తే అదిప్పటికే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా పెరిగిపోయి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ‘‘భూమి తాలూకు కీలక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. మనిషి అత్యాశ తమపై మోపుతున్న మోయలేని భారానికి తమ ప్రతిస్పందనను ఇలా పలు ప్రాకృతిక విపత్తుల రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఇప్పటికైనా అర్థం చేసుకోకుంటే మానవాళి మనుగడకే ప్రమాదం’’అని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)