సీఈవో... జీతాలు అదరహో

Published on Mon, 02/17/2025 - 05:52

కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్‌ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్‌ కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.

అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్‌ సీఈవో బ్రియాన్‌ నికోల్‌. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్‌ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్‌ అమెరికాలోని టాప్‌–20 సీఈఓల్లో ఒకరు.  

ఎందుకంత అధిక వేతనాలు? 
భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్‌ బాస్‌ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.

కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్‌ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.

భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లు
భారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్‌ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)