Breaking News

పసితనంలో చక్కెరకు చెక్‌ పెడితే.. చక్కని ఆరోగ్యంq

Published on Sun, 11/10/2024 - 05:25

మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్‌–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారి­నపడే ప్రమాదం తక్కు­­వగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)