Breaking News

ఏఐ మర్యాద.. చాలా కాస్ట్లీ గురూ

Published on Sat, 05/03/2025 - 01:48

కృత్రిమ మేధ (ఏఐ).. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఓ సరికొత్త ఆవిష్కరణ. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్  మాత్రమే తెలిసిన మనకు అంతకు మించి సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చే అనువైన సాధనం. అందుకే, ఏఐని రోజువారీ వ్యాపకాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.

గిబ్లి–శైలి, పోర్ట్రెయిట్‌ సెల్ఫీలు, గ్రూప్‌ చిత్రాల రూపకల్పనలో ఏఐని ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాట్‌ జీపీటీకి సంబంధించి ఎవరూ ఊహించలేని, ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఓపెన్  ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మాన్ . కేవలం రెండు పదాల వినియోగం వల్ల ఏఐ ఖర్చు విపరీతంగా పెరుగుతోందట. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఏఐని వినియోగించేవారిని నివ్వెరపోయేలా చేసింది.

కృత్రిమ మేధకు కృతజ్ఞతల భారం
ధన్యవాదాలు, దయచేసి అనే పదాలను.. గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు(జీపీయూ)గా పిలిచే ప్రత్యేక చిప్‌లతో నిండిన సర్వర్లను ఉపయోగించి ఏఐ ఉత్పత్తి చేస్తుంది. ప్రజలు చాట్‌జీపీటీకి ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెప్పడం వల్లే కంపెనీ విద్యుత్‌ ఖర్చుల కోసం పది మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్ ్స కంపెనీ (ఓపెన్ ఏఐ) సీఈఓ సామ్‌ ఆల్ట్‌మాన్  వెల్లడించారు. ఏఐ ద్వారా ఒక ప్రశ్నకు సమాధానం వెదకడానికి గూగుల్‌ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వినియోగదారులతో ఏఐ మర్యాదగా ఉండటానికి రోజుకి 10 మిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని ఆయన వివరించారు.

ఒక దేశానికి సరిపోయే విద్యుత్‌
కృత్రిమ మేధ, చాట్‌ జీపీటీ వంటి వ్యవస్థలకు ఎక్కువ విద్యుత్‌ శక్తిని వినియోగించే భారీ డేటా కేంద్రాలు (సర్వర్లు) అవసరం. వాషింగ్టన్  పోస్ట్‌ పరిశోధన ప్రకారం ఏఐ ద్వారా 100 పదాల ఇ–మెయిల్‌ను తయారు చేయడానికి వాడే విద్యుత్‌... గంటకు 14 ఎల్‌ఈడీ లైట్లు వెలగడానికి వాడేంత విద్యుత్‌ వినియోగంతో సమానం. అలాంటిది ప్రతిరోజూ ఏఐని మనం లక్షలాది ప్రశ్నలు అడుగుతుంటాం. వాటన్నిటికీ ఏఐకి ఎంత విద్యుత్‌ అవసరం అవుతుందో ఊహించడమే కష్టం.

ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ల విద్యుత్‌ వినియోగం వాటా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్‌ వినియోగంలో 2 శాతంగా ఉంది. ఏఐ మన నిత్య జీవితంలో మరింతగా కలిసిపోయినందున ఇది ఇంకా భారీగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాల సైట్‌ బెస్ట్‌ బ్రోకర్స్‌ పరిశోధకులు చాట్‌జీపీటీకి ఏటా సగటున 1.059 బిలియన్  యూనిట్ల విద్యుత్‌ అవసరమని కనుగొన్నారు. అంటే విద్యుత్‌ ఖర్చుల్లో ఏఐ చాట్‌బాట్‌ కోసం మాత్రమే ఏటా దాదాపు 139.7 మిలియన్  డాలర్లు ఖర్చవుతుంది. ఇది 2026 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అంటే జపాన్  వంటి దేశం మొత్తం ఇంధన అవసరాలకు సరిపోయేంత విద్యుత్‌ను ఒక్క ఏఐ వాడేస్తోంది.

కర్బన ఉద్గారాలు.. ఖర్చైపోతున్న నీరు
రివర్‌సైడ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. ఏఐకి శక్తినిచ్చే సర్వర్‌లను చల్లబరచడానికి అధిక మొత్తంలో నీరు అవసరం. వంద పదాల ఇ–మెయిల్‌కు చాట్‌జీపీటీకి 1,408 మిల్లీలీటర్ల వరకూ నీరు వినియోగం అవుతుంది. మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం ఒక పెద్ద ఏఐ మోడల్‌ను తయారు చేయడం వల్ల విడుదలయ్యే కార్బన్‌... ఐదు కార్లు వాటి మొత్తం జీవితకాలంలో విడుదల చేసే కార్బన్  కంటే ఎక్కువ.

గూగుల్‌ కూడా 2019 నుంచి ఉద్గారాలలో 48 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదంతా ఎక్కువగా ఏఐ వల్ల జరిగింది. కాబట్టి, ఏఐ అసిస్టెంట్‌కు కృతజ్ఞతలు చెప్పడం మనకు చాలా సాధారణంగా అనిపిస్తున్నప్పటికీ, ప్రతి అదనపు పదం సిస్టమ్‌ పనిభారాన్ని, పర్యావరణానికి ముప్పుని, సంస్థలకు ఖర్చుని పెంచుతుందని గుర్తించాలనే సలహా ఇప్పుడు టెక్‌ నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.

ఏఐ మర్యాద నేర్పుతోందా?..: ‘ఫ్యూచర్‌’ అనే అమెరికాకు చెందిన ఓ పత్రిక తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో ఏఐని ఉపయోగించే 67శాతం వ్యక్తులు చాట్‌బాట్‌తో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారిలోని 18 శాతం మంది ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెబుతున్నారు. మిగిలిన 82శాతం మంది అది ఏఐ అయితే ఏంటీ, సాటి మనిషి అయితే ఏంటి.. ఎవరితోనైనా మర్యాదగా ప్రవర్తించడం మంచిదని తాము ఆ విధంగా ఉన్నామని చెప్పారు. కాగా ఏఐతో మర్యాదగా ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ డిజైన్  డైరెక్టర్‌ కుర్టిస్‌ బీవర్స్‌ మైక్రోసాఫ్ట్‌ బ్లాగ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మీరు ఏఐతో మర్యాదగా ప్రవర్తిస్తే, అది అదే విధంగా స్పందించే అవకాశం ఉందనేది ఆయన మాటల సారాంశం.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)