Breaking News

స్థూల భారతం.. మందుల మార్గం!

Published on Mon, 02/24/2025 - 05:42

జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్‌ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. 

దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్‌–10 దేశాల జాబితాలోకి భారత్‌ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్‌ డెస్క్

మూడింతలు  పెరిగిన మార్కెట్‌.. 
ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్‌పీ–1 (గ్లూకగాన్‌ తరహా పెప్టైడ్‌ రిసెప్టర్‌ ఎగోనిస్ట్స్‌)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్‌ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్‌ పెరుగుతోంది.

2020 నవంబర్‌లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్‌ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్‌ పెరిగిపోతోంది.

ఖరీదైన వ్యవహారంగా  చికిత్స..
యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్‌ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

అంతర్జాతీయ కంపెనీల కన్ను.. 
భారత్‌లో బరువు తగ్గే మందులకు డిమాండ్‌ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్‌ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్‌ సెమాగ్లూటైడ్‌ ట్యాబ్లెట్‌ రైబెల్సస్‌ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్‌ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్‌ ఇంజెక్షన్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్‌ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. 

మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్‌ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్‌మార్క్‌ ఇప్పటికే లిరాగ్లూటైడ్‌ జనరిక్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్‌ ముగిసిన జీఎల్‌పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్‌ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్‌పై పరిశోధన చేస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)