Breaking News

గాడిలోకి స్టార్టప్స్‌ ఫండింగ్‌!

Published on Sun, 05/11/2025 - 02:39

దేశంలోని స్టార్టప్స్‌లోకి నిధుల రాక తిరిగి గాడిలో పడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా అవతరించిన భారత్‌లో రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాదిలో ఫండింగ్‌లో వృద్ధి నమోదైంది. దేశీయ అంకుర సంస్థలు 2024లో మొత్తం రూ.1,24,184 కోట్ల ఫండింగ్‌ అందుకున్నాయి. 2023తో పోలిస్తే ఇది 27.78 శాతం ఎక్కువ. 2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి.

అంకుర సంస్థల్లో పెట్టుబడులు 2017 నుంచి 2020 వరకు తగ్గుతూ వచ్చాయి. కరోనా  మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార తీరుతెన్నుల్లో అనూహ్యంగా సమూల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు ఐటీపై భారీగా వెచ్చించాయి. దీంతో 2021లో రికార్డు స్థాయిలో భారత అంకుర సంస్థల్లోకి రూ.3,26,800 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. ఏడాదిలో మూడింతలకుపైగా దూసుకెళ్లాయి. భారత స్టార్టప్స్‌ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కడి నుంచి ఇక తిరుగు ఉండదు అనుకున్నప్పటికీ అందుకు విరుద్ధంగా వరుసగా రెండు సంవత్సరాలు నిధుల రాక తగ్గింది. వడ్డీ రేట్లు పెరగడం; భౌగోళిక, రాజకీయ అనిశ్చితి; ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కంపెనీల పనితీరు పట్ల ఆందోళనలు.. ఈ క్షీణతకు కారణమయ్యాయి.

‘ఈ–కామర్స్‌’ జోష్‌
2024లో ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌ కంపెనీలు ఏకంగా రూ.27,778 కోట్ల నిధులను ఆకర్షించడం గమనార్హం. 2024లో అధిక మొత్తం ఫండింగ్‌ ఈ–కామర్స్‌ కంపెనీల్లోకి వెళ్లింది. 2023లో దేశీయ అంకుర సంస్థలు రూ.97,180 కోట్ల నిధులు సమీకరించాయి. 
2024లో టాప్‌ – 5 రంగాల వారీగా డీల్స్‌ చూసుకుంటే... ఈ కామర్స్‌లో 222 డీల్స్‌ జరిగాయి. ఫిన్‌టెక్‌లో 211, హెల్త్‌ టెక్‌లో 120, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ 112 డీల్స్‌ జరిగాయి. ఏఐకి సంబంధించి మాత్రం కేవలం 59 డీల్స్‌ జరగడం గమనార్హం.

ఈ మార్చి త్రైమాసికంలో ఇలా..
2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో 319 డీల్స్‌ జరిగాయి. నాలుగు సంస్థలు మూతపడ్డాయి. అయిదు స్టార్టప్స్‌ 1,300 పైచిలుకు ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. 2023లో 24,000 మందికి, 2022లో 20,000 మందికి స్టార్టప్‌ కంపెనీలు ఉద్వాసన పలికాయి. ఉద్యోగుల తీసివేతలు గత ఏడాది అతి తక్కువగా (సుమారు 4,700) నమోదయ్యాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)