Breaking News

అర్థం చేసుకోరూ..!

Published on Sun, 06/15/2025 - 02:21

ఇంటర్నెట్‌ తెచ్చిన మార్పులతో 10, 12 ఏళ్లలోపు పిల్లలకే పెద్దలకు సంబంధించిన విషయాలు తెలిసొస్తున్నాయి. ఒక వయసు వచ్చేటప్పటికే గర్ల్‌/బాయ్‌ ఫ్రెండ్స్‌ కచ్చితంగా ఉండాలనే ధోరణి ఏర్పడుతోంది. అయితే, టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పు లపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో, భావోద్వేగ ఆరోగ్యమూ అంతే ముఖ్యం. యువతకు ఆరోగ్యకర సంబంధాలను బలంగా ఏర్పరచే శక్తిని ఇవ్వాలంటే విద్య కూడా మార్గదర్శకంగా మారాలని నిపుణులు చెబుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: స్నేహం మొదలుకొని ప్రేమ వరకు... దీని పరిధిలో ప్రభావం చూపే అంశాల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల అభిప్రాయం, స్పందన–ప్రతిస్పందన ఎలా ఉండాలన్న దానిపై చాలామందికి అంటే మరీ ముఖ్యంగా జెన్‌–జెడ్‌ (జనరేషన్‌ జెడ్‌)గా పిలిచే నేటి యువతరానికి అవగాహన ఉండటం లేదు. స్నేహం, ప్రేమ, రిలేషన్‌షిప్‌లో చిన్నపాటి వైఫల్యం ఎదురైనా లేదా అలాంటి భావన కలిగినా అది మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. తిరస్కరణ పెను విపత్తుగా గోచరిస్తోంది.

ఇది డిప్రెషన్, ఆత్మహత్యలు లేదా హింసకు పురిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఇలాంటి అనేక ఘటనలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సంబంధాల ప్రభావం, భావోద్వేగ నైపుణ్యాల అవసరం విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తించగా.. ఢిల్లీ వర్సిటీ ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకుండా, విద్యాపరంగా ఓ కోర్సు రూపంలో పరిష్కరించేందుకు ముందుకు రావడం విశేషం.

భావోద్వేగాల అవగాహనపై ముందడుగు..
⇒  ప్రేమించడం ఒక్కటే కాదు, ప్రేమను ఒప్పించుకోవడం, అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవంతో నడిపించడమూ ఓ కళే. గందరగోళ ప్రపంచంలో జీవిస్తున్న జెన్‌–జెడ్‌ తరానికి, ఢిల్లీ యూనివర్సిటీ ‘నెగోషి యేటింగ్‌ ఇంటిమేట్‌ రిలేషన్‌షిప్స్‌’ అనే ఓ విశిష్టమైన కోర్సును అందుబాటు లోకి తెచ్చింది. ఈ కోర్సు ఒక గైడెన్స్‌ వ్యవస్థలా పనిచేస్తుందని కౌన్సెలర్లు, విద్యావేత్తలు, నిపు ణులు చెబుతున్నారు. జెన్‌–జెడ్‌ తరానికి అనుభవజ్ఞుల మార్గదర్శ నం కల్పించడం, భావోద్వేగ అవగాహన పెంపొందించడంలో ఇది ఓ ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...
⇒ బాడీ ఇమేజ్, సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ వంటి అంశాలు సంబంధాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
⇒ నేటి విద్యార్థులు గత తరం కంటే చాలా వ్యక్తిగత ధోరణిలోకి వెళ్లారు. భావోద్వేగాలపై కోర్సులు వారిని అంతర్గతంగా మారుస్తాయి. 
⇒ యువత నుంచి ‘నేను ఇష్టపడే వ్యక్తిని ఎలా అప్రోచ్‌ కావాలి?’, ‘వాళ్ల తల్లిదండ్రులను కలిసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధాలను నిర్మించుకోవడం, నమ్మకం పెంపొందించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి అంశాలను నేర్పే కోర్సులు తప్పనిసరిగా మారాయి.

⇒ భావోద్వేగపరమైన అవగాహన వల్ల మన బాధను, ఇతరుల బాధను అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది.
⇒ స్వీయగౌరవం, ఇతరుల హద్దులను గౌరవించడం నేర్చుకోవచ్చు. అతి తక్కువ సమయంలో సంబంధాలు విడిపోవడం తగ్గించవచ్చు.

‘నెగోషియేటింగ్‌ ఇంటిమేట్‌ రిలేషన్‌షిప్స్‌’ కోర్సు ప్రత్యేకతలివీ
⇒ ఈ కోర్సు కేవలం థియరీతో నడవదు. విద్యార్థుల స్వీయ అనుభవాలు, డిజిటల్‌ జీవితం, పాప్‌ కల్చర్‌ ప్రభావం, డేటింగ్‌ చాలెంజెస్‌ వంటి అంశాలపై విశ్లేషణ చేయించడమే దీని లక్ష్యం.
⇒ సంబంధాల్లో రెడ్‌ ఫ్లాగ్స్‌ (అపాయం సూచించే సంకేతాలు) గుర్తించడాన్ని నేర్పించటం.
⇒  భావోద్వేగ సమతుల్యత పెంపొందించటం.
⇒  గౌరవం, ఒప్పందం ఆధారంగా సంబంధాలు నిర్మించడం.
⇒ సమస్యలు, ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో నేర్పడం.
⇒ స్నేహం, ప్రేమ, లైంగికతలతో ముడిపడిన ప్రవర్తన గురించి మౌలిక అవగాహన కల్పించడం.
⇒ సోషల్‌ మీడియా, షోలు, రీల్స్‌ వంటివి మన సంబంధాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషించడం.

ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించాలి...
ళీ టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పులపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. టీచర్లకు కూడా విద్యార్థు లకు ఈ విషయంపై ఏమి బోధించాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో  ప్రభు త్వాలు కూడా ఆలోచించి ప్రతీ విద్యాసంస్థలో ఒకరిద్దరు ఫ్యాకల్టీ మెంబర్లకు భావోద్వేగపరమైన అంశాలు, స్నేహాలు, సంబంధాలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు బోధించేలా చూడాలి. మేము ఇప్పటికే 500కుపైగా స్కూళ్లలో ప్రేమలు, రిలేషన్స్‌ షిప్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలి, వాటితో ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. – సి.వీరేందర్, సైకాలజిస్ట్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)