Breaking News

మా కాలంలో ఇలా లేదమ్మా..

Published on Sun, 07/06/2025 - 06:26

మీ పిల్లలు ఫోన్లలో లేదా రీల్స్‌లో మునిగిపోయినప్పుడు.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్నదే లేకుంటే బాగుణ్ను.. వీళ్లు బాగుపడేవాళ్లు అని అనుకున్నారా? లేదా మా కాలంలో ఇలాంటి అడిక్షన్లు ఉండేవి కావు.. చక్కగా బయట ఆడుకునేవాళ్లం అని క్లాసులు పీకారా?

అలాగే మీ పిల్లలు ఎదిగే క్రమంలో సోషల్‌ మీడియా కావొచ్చు.. వీడియో గేమ్స్‌ కావచ్చు.. ఇవన్నీ వాళ్ల భవిష్యత్తుకు ప్రతిబంధకాలు అని అనుకుంటున్నారా? చాలామంది అనుకునే ఉంటారు.. మనమే కాదు.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి.. ఇటీవల అమెరికాలో ఓ సర్వే జరిగింది. అందులో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లల ఎదుగుదల లేదా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు.. వీటిని కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని వేటి గురించి అనుకున్నారు అని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఆన్‌లైన్లోని అడల్ట్‌ కంటెంట్‌ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే..  

ప్రత్యేకంగా ఒక్కొక్కటిగా ప్రశ్నించినప్పుడు టిక్‌టాక్‌ కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని  సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అన్నారు. ఇంతే శాతం మంది ‘ఎక్స్‌’(ట్విట్టర్‌) విషయంలోనూ చెప్పారు. ఇన్‌స్ట్రాగాం లేకుండా ఉంటే బాగుండేదని 56 శాతం మంది అన్నారు.  ఆధారం: ది హారిస్‌ పోల్‌–మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ.. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)