Breaking News

కాస్మిక్‌ బోన్‌కు పగుళ్లు

Published on Mon, 05/05/2025 - 03:23

భూగోళంతో పాటు ఇతర గ్రహాలు, సూర్యుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలున్న మన పాలపుంతలో అంతరిక్ష ఎముకలు (కాస్మిక్‌ బోన్సు) కూడా ఉంటాయని మీకు తెలుసా? నిలువుగా, సన్నగా ఉండే వీటిని ఆకారం వల్ల ఎముకలుగా పిలుస్తుంటారు. వ్యోమగాములకు అంతరిక్షం నుంచి ఇవి సర్పాకృతిలో కనిపిస్తుంటాయి. ఇవీ ఒకరకంగా నక్షత్రాల్లాంటివే. వీటి నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయి. భూమి నుంచి 26 వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంత మధ్యభాగానికి సమీపంలో ఉన్న జీ359.13 అనే ఇలాంటి కాస్మిక్‌ బోన్‌కు పగుళ్లు వచ్చినట్లు సైంటిస్టులు తాజాగా గుర్తించారు.

ఇది మన పాలపుంతలో అత్యంత పొడవైన, ప్రకాశవంతమైన ఎముకల్లో ఒకటి. పల్సర్‌ అనే న్యూట్రాన్‌ స్టార్‌ గంటకు ఏకంగా 20 లక్షల మైళ్ల వేగంతో ఢీకొట్టడం వల్లే ఈ పగుళ్లు ఏర్పడినట్లు చంద్ర ఎక్స్‌–రే అబ్జర్వేటరీతో పాటు ఇతర రేడియో టెలిస్కోప్‌ల ద్వారా కనిపెట్టారు. ఈ చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. భారీ నక్షత్రాలు పేలిపోవడం వల్ల న్యూట్రాన్‌ నక్షత్రాలు ఏర్పడుతుంటాయి. అవి అత్యధిక ఆయస్కాంత శక్తిని కలిగి ఉండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ను వెలువరిస్తాయి. సెకనుకు కొన్ని వందలసార్లు తమ చుట్టూ తాము తిరుగుతూ అంతరిక్షంలోకి వేగంగా దూసుకెళ్తాయి. దారికి అడ్డొచ్చివాటిని అడ్డంగా ఢీకొంటాయి.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు