Breaking News

సామాజిక సాధికార యాత్ర: పోటెత్తిన ‘అనంత’

Published on Fri, 12/29/2023 - 18:50

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శుక్రవారం) అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర అంబేద్కర్‌ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు. 

పేర్ని నాని మాట్లాడుతూ..  ‘ఎస్సీ ఎస్టీ,  బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే.  40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?,  రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి’అని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ..  ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ వంటి వారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.

ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు ఉంటాయి. అభివృద్ధి విషయంలో వైఎస్సార్‌ ఒక అడుగు ముందుకేస్తే, సీఎం జగన్‌ రెండు అడుగులు వేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)