Breaking News

‘మేము అభివృద్ధి కోరుతున్నాం.. అరాచకం కాదు’

Published on Sat, 05/03/2025 - 15:48

పశ్చిమ గోదావరి జిల్లా : ఏపీలో ఎక్కడ చూసినా అరాచక పాలనే కొనసాగుతుందన్నారు పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు.  ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారేనన్నారు. ‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారు.

రాష్ట్రoలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే  గోవద ప్రోత్స హిస్తున్నారు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చుతున్నారు. పేదలకు ప్రత్యామ్నాయం  చూపకుండా వారి ఇళ్లు కూల్చేస్తున్నారు. మీరు పేదలకు ఎన్ని ఇళ్లు  నిర్మించారు. అధికార బలంతో నిరుపేదల ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆక్రమణల పేరుతో పేదలను నిరాశ్రయులు చేయడం సరికాదు. ఇరిగేషన్ మంత్రి ఉన్నా డెల్టా ఆధునీకరణ ఊసే లేదు. వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. మేము అభివృద్ధికోరుతున్నాం.. అరాచకం కాదు. రాష్టంలోపక్షపాత కక్ష పూరిత పాలన సాగుతుంది.

మేము స్యాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చాం. ఆక్వా రైతులను గాలికి వదిలేసారు..ఫీడ్ సీడ్ ధరలు కట్టడి లేదు. నిరుపేదలకు, రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది’ అని ప్రసాద్ రాజు తెలిపారు.

సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి..
అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అని ఊదరగొట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట్ నాగేశ్వరావు మండిపడ్డారు. ‘సెంటు భూమి సమాధి కి కూడా సరి పోదు అన్న మీరు 3సెంటు భూమి ఇచ్చారా.?, పాలకోడేరులోపేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం. పేదలను హింసించడం సరికాదు.  మేము 32 లక్షల ఇళ్లు ఇచ్చాము.. మీరు పేదల ఇళ్ల ఇవ్వాలన్న వూసేలేదు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు అది ఈ కూటమికి పాలనకు సిగ్గు చేటు. నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు లో చేతులు ఎత్తేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి.’ అని కారుమూరి డిమాండ్ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)