Breaking News

‘బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్‌ చేయించాలి’

Published on Thu, 09/25/2025 - 17:20

తాడేపల్లి : సినిమా ఫంక్షన్‌లకు వెళ్లినట్లు అసెంబ్లీకి కూడా అలానే వెళ్లారా? అని ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణను ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బాలకృష్ణ మానసిక స్థితిపై తమకు అనుమానం ఉందన్నారు భరత్‌. ఈరోజు(గురువారం, సెప్టెంబర్‌ 25వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన భరత్‌.. ‘ అసెంబ్లీలో బాలకృష్ణ మాట తీరు.. వ్యవహార శైలి దారుణంగా ఉంది. నెత్తి మీద విగ్గు, దానిమీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా?, మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు. 

ఆయన మాట తడపడుతూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికి 86 మందిని అరెస్టు చేశారు. తారక్ అనే సోషల్ మీడియా కార్యకర్త మీద దోపిడీ దొంగలు, కిడ్నాపర్ల మీద పెట్టే కేసులు పెట్టారు. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వానికి బుద్ది రాలేదు

రాజమండ్రికి చెందిన పులి సాగర్ అనే ఎస్సీ యువకుడిని అర్దనగ్నంగా లాకప్‌లో పెట్టి వేధించారు. ఎస్సీ కమిషన్ సీరియస్ అయి నోటీసులు కూడా ఇచ్చింది. సీసీ కెమెరా పుటేజీ అడిగితే కెమెరాలు  పని చేయటం లేదని అధికారులు అబద్దాలు చెప్పారు. పోలీసులను టీడీపీ నేతల కోసం వాడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఏకంగా పోలీసులపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు. 

	నెత్తి మీద విగ్గు, జేబులో చేతులు బాలకృష్ణ వ్యాఖ్యలపై మార్గాని భరత్ ఫైర్

 

అసెంబ్లీ వేదికగా జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌లు మండిపడ్డారు. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు పెట్టుకుంటే సరిపోదని, ఒంటికి కొంచెం సిగ్గు అనేది ఉండాలని విమర్శించారు గుడివాడ అమర్నాథ్‌ ప్రపంచంలోనే బాలకృష్ణ అతిపెద్ద సైకో అని, కావాలంటే సర్టిఫికెట్‌ ప్రొడ్యూస్‌ చేస్తానన్నారు అంబటి రాంబాబు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)