Breaking News

చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్‌ జగన్‌

Published on Thu, 06/19/2025 - 12:28

సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ ఏం పాపం చేశారని అరెస్ట్‌ చేశారు. అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?.  

పక్కా ప్లన్‌, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్‌గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్‌ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. 

‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..

  • శ్రీకాకుళంలో 

  • మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలు
    మెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.

  • విశాఖలో..

  •  ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్‌. 
    అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.

  • తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).
    బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. 

  • విజయవాడలో
    గద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ భార్య 
    గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కుమారుడు.

 

  • మంగళగిరిలో.. 
    కంభంపాటి శిరీష ఎస్‌సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌.
  • అనంతపురంలో.. 
    స్వప్న.. టీడీపీ మహిళా వింగ్‌ స్టేట్‌ సెక్రటరీ. 
    సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్‌ సెక్రటరీ.
  • కడపలో.. 
    బొజ్జా తిరుమలేష్‌.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌. 
సాక్షి ఆఫీసులపై టీడీపీ గుండాలు దాడులు... వైఎస్ జగన్ ఫైర్
  • తిరుపతి.. 
    ఆర్‌సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్‌. 
    కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి. 

     


     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)