వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే..

Published on Wed, 11/01/2023 - 17:25

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి  పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు  టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని  శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి. 

శేరిలింగంపల్లి సీటు  విషయంలో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న  మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు  రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. 

ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.  తాజా పరిణామాలతో స్టేట్‌ బీజేపీ నుంచి  నెక్ట్స్  ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్‌ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)