Breaking News

యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై కుట్రలెందుకు?

Published on Sun, 10/01/2023 - 03:15

సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ­కంగా చేపట్టిన యాదాద్రి థర్మల్‌ అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌కు కావాలనే కేంద్ర ప్రభుత్వం అనుమ­తులు ఇవ్వడం లేదని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. అనుమతులు ఇవ్వడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై మండిపడ్డారు.

తొమ్మిది నెలల్లో టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ ఇవ్వాలన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను కేంద్రం బేఖాతర్‌ చేస్తోందని, థర్మల్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా అనుమతులు రావడం లేదన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని కేంద్ర మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మోదీ అడుగు­పెట్టే ముందు ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారు­తుందనే యాదాద్రి ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్‌ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని, మూడు గంటలు చాలు అన్న కాంగ్రెస్‌ నాయకులు...కరెంట్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వరిచేను, ఒక్క వరి కంకి ఎండిపోలేదని, ప్రతిపక్షాలది పసలేని ప్రచారం అని ఎద్దేవా చేశారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి