Breaking News

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!

Published on Mon, 08/07/2023 - 18:10

దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం

దేవరకొండ గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన ఆర్‌.రవీంద్ర కుమార్‌ మూడోసారి విజయం సాదించారు.2004,2014లలో సిపిఐ పక్షాన గెలిచిన రవీంద్ర కుమార్‌ 2018లో  టిఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. 2014లో విజయం సాదించిన కొంతకాలానికి ఆయన అదికార టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ ఎన్నికలో ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌పై 38848 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.

రవీంద్రకుమార్‌కు 96454 ఓట్లు రాగా, బాలూనాయక్‌కు 57606 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి పక్షాన పోటీచేసిన బిల్యా నాయక్‌కు 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్‌ ఐ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తెలంగాణ లో దేవరకొండ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో  రమావత్‌ రవీంద్ర కుమార్‌ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్‌ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు .

దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు,  సిపిఐ ఏడుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి, పిడిఎఫ్‌ ఒకసారి గెలుపొందాయి. సిపిఐ నాయకుడు బద్దు చౌహాన్‌ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. గిరిజన నేత రవీంద్రనాయక్‌ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2004లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్‌ఎస్‌ పక్షాన  పోటీచేసి విజయం సాధించారు.

దేవరకొండలో ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. రవీంద్రనాయక్‌  గతంలో భవనం వెంకట్రామ్‌ మంత్రివర్గంలో  సభ్యునిగా వున్నారు. 1999లో ఇక్కడ గెలిచిన రాగ్యానాయక్‌ 2001 డిసెంబర్‌లో నక్సల్స్‌ కాల్పులలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రాగ్యానాయక్‌ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం భారతి ఎమ్మెల్సిగా  కూడా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎస్‌.టి.లకు రిజర్వు కాక ముందు రెడ్లు రెండుసార్లు బ్రాహ్మణ ఒకసారి గెలిచారు.

దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)