Breaking News

అలంపూర్‌ (ఎస్సి) నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?

Published on Sat, 08/05/2023 - 18:13

అలంపూర్‌ (ఎస్సి) నియోజకవర్గం

అలంపూర్‌ రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన మల్లెపోగు అబ్రహం గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ ఐ  పక్షాన ఒకసారి గెలిచిన అబ్రహం 2018లో టిఆర్‌ఎస్‌లో చేరి పోటీచేసి విజయం సాదించారు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది సంపత్‌కుమార్‌  ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి సంపత్‌ను  అనుచిత ప్రవర్తన పేరుతో  బహిష్కరించడం వివాదం అయింది. ఆ సానుభూతి కూడా ఆయనకు పనిచేయలేదు. అబ్రహం 44670 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు.

అబ్రహంకు 102105 ఓట్లు రాగా, సంపత్‌ కుమార్‌కు 57426 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్‌.ఎప్‌.బి తరపున పోటీచేసిన హరిజన అబ్రహంకు 6800 ఓట్లు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అలంపూర్‌  నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్ళింది. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్‌ ఐ పార్టీ, ఒకసారి టిఆర్‌ఎస్‌ గెలిచాయి. 2014లో కాంగ్రెస్‌  ఐ అభ్యర్ధి సంపత్‌ కుమార్‌, సిటింగ్‌ ఎమ్మెల్యే వి.ఎమ్‌.అబ్రహం ను 6730 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.అబ్రహం కాంగ్రెస్‌ ఐ నుంచి టిడిపిలోకి వెళ్లి పోటీచేశారు. ఇక్కడ 2014లో  టిఆర్‌ఎస్‌ తరపున పోటీచేసిన మాజీ ఎమ్‌.పి మందా జగన్నాధం కుమారుడు శ్రీనాద్‌ ఓడిపోయారు.

శ్రీనాద్‌కు 38136 ఓట్లు వచ్చాయి.కాగా 2014లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజక వర్గానికి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన మందా జగన్నాధం కూడా ఓడిపోవడం విశేషం. అలంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఎనిమిదిసార్లు, భారతీయ జనతాపార్టీ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి, జనతా ఒకసారి గెలిచాయి. ఒక  ఇండిపెండెంటు కూడా నెగ్గారు. బిజెపి నేత రావుల రవీంద్రనాధరెడ్డి ఇక్కడ మూడుసార్లు గెలిచారు. రవీంద్రనాద్‌ రెడ్డి తదుపరి  కాంగ్రెస్‌ ఐలో చేరినా, టిక్కెట్‌ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా దేవరకద్రలో పోటీచేసి ఓడిపోయారు. అలంపూర్‌లో రెండుసార్లు గెలిచిన టి. చంధ్రశేఖర్‌ రెడ్డి, ఒకసారి గెలిచిన రజనీబాబులు సోదరులు.

అలాగే రెండుసార్లు శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ కూడా వీరికి సోదరి అవుతారు. 1952లో ఇక్కడ గెలిచిన నాగన్న కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌లలో కలిపి నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన పి. పుల్లారెడ్డి, గద్వాలలో కూడా మరోసారి గెలిచారు. 2004లో గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనుమడు అవుతారు. ఈయన తండ్రి రాంభూపాల్‌రెడ్డి మూడుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. కాగా అలంపూర్‌  రిజర్వు కావడానికి  ముందు తొమ్మిదిసార్లు రెడ్లు, నాలుగు సార్లు కమ్మ, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు.

అలంపూర్‌ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)