Breaking News

పెద్దపల్లి నియోజకవర్గం పాలకవర్గం ఎవరు?

Published on Sat, 07/29/2023 - 15:49

పెద్దపల్లి నియోజకవర్గం

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సిటింగ్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది విజయ రమణారావును 8466 ఓట్లు తేడాతో ఓడిరచారు. విజయ రమణారావు 2009లో  టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, తదుపరి 2018లో ఆయన కాంగ్రెస్‌ ఐలో చేరి ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మనోహర్‌ రెడ్డికి 82765 ఓట్లు సాదించగా, కాంగ్రెస్‌కు 74299 ఓట్లు మాత్రమే వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బిజెపి పక్షాన పోటీచేసి కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే పొందారు. దాసరి మనోహర్‌ రెడ్డి మరోసారి గెలవడం ద్వారా పట్టు నిలబెట్టుకున్నారు. 2014లో డి.మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధి , ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై 62677 ఓట్ల భారీ ఆదిక్యతతో గెలుపొందారు.

2014లో  తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం ఎంత తీవ్రంగా వీచిందో ఈ మెజార్టీ తెలియచేస్తుంది. ఎన్నికల తర్వాత బానూ ప్రసాద్‌ కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. పెద్దపల్లి శాసనసభ నియోజక వర్గంలో ఇంతవరకు మనోహర్‌ రెడ్డితో సహా పదిసార్లు రెడ్లు గెలిచారు.  ఇద్దరు వెలమ, ఒక బిసి, ఇద్దరు ఎస్సి వర్గ నేతలు గెలుపొందారు. ముకుందరెడ్డి పెద్దపల్లి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండుసార్లు కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలవగా, 2004లో టిఆర్‌ఎస్‌ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత టిఆర్‌ఎస్‌లో అసమ్మతివర్గంలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కేసులో శానససభ్యత్వానికి అనర్హునిగా అప్పటి స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌రెడ్డి ప్రకటించారు.

అయితే స్పీకరు తీర్పు రావడానికి ఒక రోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. తదుపరి కాంగ్రెస్‌ ఐలో  చేరి 2009లో  పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో  టిడిపి, టిఆర్‌ఎస్‌లు పొత్తు కుదిరినప్పటికీ, ఒక దశలో పొత్తు ఉంటుందో, ఉండదోనన్న అనుమానంతో టిడిపి తన అభ్యర్దులు పలువురికి టిఆర్‌ఎస్‌కు కేటాయించిన సీట్లలో పోటీకి సిద్దం చేసింది. అలాంటి చోట్లలో ఒకట్కెన పెద్దపల్లిలో టిడిపి పక్షాన బిఫారం ఇచ్చేయడంతో నామినేషన్‌ వేసిన విజయరమణరావు ఆ పార్టీ అభ్యర్ధిగానే రంగంలో ఉండి2009లో గెలిచారు. 1983లో  సంజయ్‌  విచార్‌ మంచ్‌ తరపున టిడిపి గుర్తుపై పోటీచేసి గెలిచిన గోనె ప్రకాశరావు, కొద్దినెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1962లో పెద్దపల్లిలో గెలిచిన బుట్టిరాజారాం 1952లో జగిత్యాల, 57లో సుల్తానా బాద్‌లో, 1967లో నుస్తులాపూర్‌లోను మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1967లో ఇండిపెండెంటుగా గెలిచిన జె.మల్లారెడ్డి, 1972లో కాంగ్రెస్‌ తరుపున గెలిచారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)