Breaking News

భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?

Published on Fri, 08/11/2023 - 18:12

భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం

భద్రాచలం గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం విశేషం. ములుగు సీటును మరో నేత సీతక్కకు కేటాయించి వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప టిఆర్‌ ఎస్‌ ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై  11785 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.వీరయ్యకు 47746 ఓట్లు రాగా,వెంకటరావుకు 35961 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ సిపిఎం పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్‌.పి మిడియం బాబూరావుకు 12400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సిపిఎం కంచుకోటగా ఉండేది. కాని వివిధ పరిణామాలలో ఆ పార్టీ బలహీనపడిపోయింది. భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 2014లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడిరచారు. రాజయ్య అంతకు ముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా ఈయన ఉన్నారు. 2018లో రాజయ్య పోటీచేయలేదు. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు.

2014లో ఆయన ఓడిపోయారు. 2018లో సిపిఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిద్యం లేకుండా పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి  పరా జయం చెందారు. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్రప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. భద్రాచలం 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.

1952లో కెఎమ్‌పిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పి.విరావు గెలిచారు. ఈ ఉప ఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్‌ గెలిచింది. సిపిఎం   ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒకసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సిపిఐ మాజీ ఎం.పి సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో  టిడిపిలో చేరి భద్రాచలంలో పోటీచేసినా ఓడిపోయారు.

భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)