Breaking News

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పుడు గెలిపించేది ఎవరిని?

Published on Sat, 08/05/2023 - 13:40

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం

గెజిటెడ్‌ అదికారుల సంఘం అధ్యక్షుడుగా తెలంగాణ ఉద్యమంలో ఒక భూమిక పోషించిన మహబూబ్‌నగర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌ రెండోసారి విజయం సాదించారు. ఆ తర్వాత ఆయనకు కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. టిఆర్‌ఎస్‌ పక్షాన మరోసారి పోటీచేసిన శ్రీనివాసగౌడ్‌ తన సమీప టిడిపి ప్రత్యర్ది ఎమ్‌.చంద్ర శేఖర్‌పై 57775 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. శ్రీనివాసగౌడ్‌కు 86474ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 28699 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసి ఇబ్రహిం సయ్యద్‌కు 21600 పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడో స్థానంలో నిలిచారు.

2014లో శ్రీనివాస గౌడ్‌ , బిజెపి నేత శ్రీనివాసరెడ్డిపై 3139  ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్‌తో పాటు, టిఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్ధి  కూడా ఉన్నా, టిఆర్‌ఎస్‌ నేతగా శ్రీనివాసగౌడ్‌ విజయం సాధించడం విశేషం. మహబూబ్‌ నగర్‌లో పదకుండుసార్లు బిసి నేతలు, నాలుగుసార్లు రెడ్డి నేతలు,రెండుసార్లు ముస్లిం నేతలు గెలుపొందారు. 2009లో గెలిచిన స్వతంత్ర సభ్యుడు రాజేశ్వరరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో జరిగిన ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నెం శ్రీనివాసరెడ్డి సంచలన విజయం సాధించారు. కాని2014 సాధారణ ఎన్నికలో ఓటమిపాలయ్యారు. 2004లో కూడా ఇక్కడ  ఇండిపెండెంటుగా పోటీచేసిన కాంగ్రెస్‌ ఐ తిరుగుబాటు అభ్యర్ధి పులివీరన్న గెలిచారు.

మహబూబ్‌నగర్‌కు  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్‌ రెండుసార్లు, బిజేపి ఒకసారి, ప్రజాపార్టీ ఒకసారి గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి నెగ్గారు. టిడిపి పక్షాన సీనియర్‌ నేత పి. చంధ్రశేఖర్‌ మహబూబ్‌నగర్‌లో నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారిలో ఇబ్రహిం ఆలీ అన్సారీ,  ఎమ్‌. రామిరెడ్డి, పులి వీరన్నలు రెండేసి సార్లు గెలిచారు. చంధ్ర శేఖర్‌  గతంలో  ఎన్‌.టి.ఆర్‌.,చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేస్తే, పులి వీరన్న 1993లో  కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో ఉన్నారు. ఇబ్రహిం ఆలీ అన్సారీ పూర్వం కాసు, పి.వి., జలగం, క్యాబినెట్‌లలో ఉన్నారు.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)