మోదీ నూతన క్యాబినెట్‌లో అనుప్రియ పటేల్‌

Published on Sun, 06/09/2024 - 11:15

ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్  మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్‌ ఎవరు?

అనుప్రియా పటేల్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.

వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)