Breaking News

మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?

Published on Thu, 04/18/2024 - 10:36

2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.

ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్‌డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్‌డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు.

లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో  ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్‌డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)