Breaking News

Delhi Election 2025: ఆప్‌ ఓటమి బాట.. ఐదు కారణాలు

Published on Sat, 02/08/2025 - 11:57

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ  ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే  వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి  ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:

1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు: 
పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను  అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్  హామీలు నెరవేరలేదు.

2. నాయకత్వ అస్థిరత: 
కేజ్రీవాల్ అరెస్టు..  ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం  పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది.  అరవింద్ కేజ్రీవాల్‌పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.

3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్‌: 
వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్‌లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ  బలహీనపడింది.

4. అంతర్గత కలహాలు- రాజీనామాలు: 
పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.

5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం: 
ఆప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు  ఆమ్‌ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)