Breaking News

ఇక ‘ఆప్‌’ప్లాన్‌ ఏంటి? సిసోడియా ఏమన్నారు?

Published on Mon, 02/10/2025 - 08:02

న్యూఢిల్లీ: ఢ్లిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్‌’కు ఘోర పరాభవం ఎదురయ్యింది. పార్టీలోని పెద్ద నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో వారంతా దక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.  ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్‌ జాతీయ  కన్వనీర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియా కూడా పాల్గొన్నారు. పార్టీ ఓటమి పాలయిన తర్వాత భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నకు సిసోడియా సమాధానమిచ్చారు.

మనీష్‌ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై తమ నేత కేజ్రీవాల్‌ అందరితో చర్చించారని, తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, తాము ఏవిధంగానైతే ఢ్లిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోరాటం సాగించామో, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలోనే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు, చీరలు, చివరికి మద్యం కూడా పంపిణీ చేశారని, ఎన్నికల వ్యవస్థను దురుపయోగం చేశారని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో జరిగిన ఎన్నికల్లో పోటీ అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ ఆప్‌ తన పోరాటాన్ని ఆపలేదన్నారు.

ఓటమి పాలయిన నేతలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక విషయం చెప్పారని.. వారు పోటీ చేసిన ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల అనంతరం నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగన్న ఆప్‌కు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్‌ 22 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)