బీజేపీ భారత్‌ వీడిపో

Published on Sun, 08/13/2023 - 05:46

కోల్‌కతా: మణిపూర్‌ హింసాకాండ కారకులపై  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్‌ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు.

పెద్ద నోట్ల రద్దు, రఫేల్‌ ఒప్పందం, పీఎం కేర్‌ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్‌ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్‌ పాలకుల్ని క్విట్‌ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్‌ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)