Breaking News

టమాటాల దండతో రాజ్యసభకు ఆప్ ఎంపీ.. వీడియో వైరల్‌..

Published on Wed, 08/09/2023 - 21:11

ఢిల్లీ: దేశంలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కిలో టమాటాలు రూ.200 పైనే అమ్ముడుపోయాయి. టమాటా ధరల పెరుగుదల రాజకీయంగా కూడా వార్తల్లో నిలిచింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. అటు పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు టమాటా మంచి ఆయుధంగా కూడా మారింది. తాజాగా రాజ్యసభ సమావేశాలకు వెళ్లి ఆప్ ఎంపీ వినూత్నంగా నిరసన తెలిపారు. 

టమాట ధరల పెరుగుదలతో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా రాజ్యసభకు సరికొత్తగా నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా టమాటా  దండను మెడలో వేసుకుని రాజ్యసభకు వెళ్లారు. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవ మర్యాదలు కాపాడాలని అన్నారు. సదరు సభ్యునిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కాగా.. ధరల పెరుగుదలకు నిరసనగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది. 

ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..

  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు