Breaking News

జనసేనతో పొత్తు ఉందో.. లేదో పైవాళ్లే చెప్పాలి

Published on Wed, 10/04/2023 - 04:12

సాక్షి, అమరావతి: ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతోందా లేదా అన్నది తమ అధిష్టానమే చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. పురందేశ్వరితో పాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ , కోర్‌కమిటీ సభ్యులు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్‌రెడ్డి, సీతారామాంజనేయచౌదరి, శివన్నారాయణ, కాశీవిశ్వనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనసేనతో పొత్తు అంశం, ఇటీవల పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ పేరు కనీసం ఉచ్ఛరించకపోవడం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. సమావేశ వివరాలను పురందేశ్వరి మీడియా­కు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేనతో ప్రస్తు­తం బీజేపీ పొత్తు కొనసాగుతోందా.. లేదా.. అని ఓ విలేకరి ప్రశ్నించగా.. పురందేశ్వరి బదు­లిస్తూ ‘దానిపై నిర్ణయం మా కేంద్ర నాయ­కత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని మేం మా నాయకత్వానికి వివరించి చెబుతాం. వారు (పవన్‌కళ్యాణ్‌) ఏకారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారో వారే చెప్పారు.

అవన్నీ మేం మా నాయకత్వానికి చె­బు­తాం. దానిపై నిర్ణ­యం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది..’ అని చెప్పారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటాయిగానీ, తమది జాతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలో ప్రతిదానికి ఒక ప్రొసీజరు ఉంటుందని, దాని ప్రకారమే వెళతామని చెప్పారు. బీజేపీతో కలిసి వెళితే ఓట్లు వస్తాయేమోగానీ, జనసేన నుంచి ఎంతమంది అసెంబ్లీకి వెళతామో గ్యారంటీ ఇవ్వలేమంటూ పవన్‌ తమ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మాటలను విలేకరులు గుర్తుచేయగా.. ‘అది ఆయన కామెంట్‌. వారి ప్రతి కామెంట్‌ మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు.

మా పార్టీ, మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుకూలంగానే వెళతాం..’ అని బదులిచ్చారు. జనసేన–టీడీపీ పొత్తు కచ్చితం, మాతో బీజేపీ కలిసివస్తుందో రాదో తేల్చుకోవాలని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారి (పవన్‌) వైపు నుంచి ఆయన చెప్పారు. మాకు కూడా పైనుంచి రావాలి కదా. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించి వెళతాం’ అని ఆమె పేర్కొన్నారు. 

దసరాకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం   
దసరా పండుగకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కోర్‌ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పురందేశ్వరి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నాయకుడు సంతోష్‌ ఆ సమావేశానికి వస్తారని తెలిపారు.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)