Breaking News

‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’

Published on Wed, 05/22/2024 - 11:53

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో పలువురు నేతల ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎన్నికల బరిలోకి దిగిన  విక్రమాదిత్య సింగ్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంగనా వెళుతున్న ఆలయాలను శుద్ధి చేయాల్సి న అవసరం ఉందన్నారు. టకోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేవ్‌ సమాజానికి చెందిన కంగనా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఆహారపు అలవాట్ల గురించి చెబుతుంటారని, ఇది దేవ్ సమాజంవారికి తలవంపులుగా మారాయన్నారు. ఆమె దేవ్ సమాజపు పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేవభూమిలో  ఉంటున్నవారికి ఇక్కడి దేవనీతిపై ఎంతో నమ్మకం ఉందన్నారు.

తన తండ్రి వీరభద్ర సింగ్ ఆరు సార్లు సీఎం అయ్యారని, అది ప్రజల ఆశీర్వాదమని, కంగనా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే బదులు ప్రధాని మోదీని పదవి నుంచి తప్పుకోవాలని కోరాలన్నారు. ప్రధాని మోదీ  గుజరాత్‌కు చాలా ఏళ్లుగా సీఎంగా ఉన్నారని, ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.

నటి కంగనా ముంబైలో ఒక కాలు, హిమాచల్‌లో ఒక కాలు పెడుతూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని, ఆమె అతి త్వరలో మునిగిపోతారన్నారు. కంగనాకు జూన్ 4 తర్వాత తిరిగి ముంబైలో సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)