కరూర్‌ తొక్కిసలాట.. టీవీకే అధినేత విజయ్‌ కీలక నిర్ణయం

Published on Wed, 10/01/2025 - 14:47

సాక్షి, చెన్నై: కరూర్‌ ర్యాలీ దుర్ఘటనతో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

గత శనివారం సాయంత్రం తమిళనాడులోని కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన మీట్‌ ద పీపుల్‌ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విజయ్‌పై  రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాట దుర్ఘటనలో టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్‌ సైతం కరూర్‌ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని ప్రకటించారు. 

ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్‌1)విజయ్ తన టీవీకే పార్టీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీవీకే తన అధికారిక ‘ఎక్స్’ ట్వీట్‌ చేసింది. ‘మా ప్రియమైన వారిని కోల్పోయినందుకు మేము బాధలో ఉన్నాం. ఈ పరిస్థితిలో రాబోయే రెండు వారాల పాటు టీవీకే బహిరంగ సభలను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది’అని ట్వీట్‌లో పేర్కొంది. పార్టీ అధినేత విజయ్‌ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ భవిష్యత్‌ కార్యచరణకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’అని తెలిపింది. 

టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం

 

Videos

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)