Breaking News

కరూర్‌ తొక్కిసలాట.. బాధితులతో విజయ్‌ భేటీపై పోలీసుల ఆంక్షలు

Published on Sat, 10/11/2025 - 18:21

సాక్షి,చెన్నై: కరూర్‌ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు నటుడు,తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌ సిద్ధమయ్యారు. అ‍యితే ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి పరామర్శించేందుకు విజయ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

కరూర్‌ తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో విజయ్‌ ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి నేరుగా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కరూర్‌ తొక్కిసలాటలోని బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతో తమిళనాడు డీజీపీకి ఈమెయిల్ ద్వారా అనుమతి కోరారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇంకా రాలేదు. భద్రతా కారణాల వల్ల విజయ్‌ పరామర్శను ఒకే వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంటింటికి  వెళ్లి బాధితుల్ని కలవడం వల్ల గందరగోళం నెలకోవడంతో పాటు, అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని అందుకే విజయ్‌కు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు బాధితుల పరామర్శ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని టీవీకే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో విజయ్‌ కరూర్‌లో బాధితులందరూ ఒకే చోట సమావేశయ్యేలా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రానున్నారు. ఆ ప్రాంతం వరకు జనం లేకుండా చూడాలని టీవీకే ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

టీవీకే అనుమతికి అనుగుణంగా పోలీసులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ వచ్చే మార్గంలో చెక్‌పాయింట్‌లు,మొబైల్ పెట్రోల్ యూనిట్లు, ప్రజలు గుమిగూడకుండా ట్రాఫిక్ మళ్లింపులు, జనసమూహాన్ని నివారించడానికి విమానాశ్రయం ఎంట్రన్స్‌,ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద పోలీసు ఎస్కార్ట్‌లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తమిళ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

దీంతోపాటు కరూర్‌లో జరిగే వేదికకు సంబంధించి..ఒక కిలోమీటరు వరకు పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు అనుమతి ఇవ్వనున్నారు. ఎంట్రీ,ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద బాధితుల కుటుంబ సభ్యులన్ని ధృవీకరిస్తారు. ఆ సమయంలో జనం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)