Breaking News

వైఎస్‌ జగన్‌ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం

Published on Wed, 07/10/2024 - 05:22

కడప (కార్పొరేషన్‌): వైఎస్సార్‌సీపీ అధి­నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.

వైఎస్‌ జగన్‌ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా­రని సోషల్‌ మీడియాలో వాళ్లే పోస్ట్‌ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్‌ స్పందించడం మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

వైఎస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు.  ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్‌ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్‌ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)