Breaking News

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?

Published on Tue, 01/09/2024 - 11:45

చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని  డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా..  ఆయన పుకారుగా పేర్కొన్నారు. 

ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు.  డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. 

ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌