Breaking News

హద్దులు మీరిన చర్చ.. వేళ్లు చూపుతూ..

Published on Thu, 08/24/2023 - 16:40

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్‌లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ‍ప్రథమం.     

నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం  పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన  రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్‌లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు. 

ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్‌ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు. 

నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది. 

ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)