Breaking News

మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం

Published on Tue, 06/04/2024 - 12:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్‌రెడ్డి (హైదరాబాద్‌), గోడం నగేశ్‌ (ఆదిలాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్‌ నగర్), భరత్‌ ప్రసాద్‌ (నాగర్‌ కర్నూల్‌) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు.  మే 13న ఇక్కడ ఓటింగ్‌ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)