Breaking News

Tripura: ఇంటింటికీ తిరుగుతున్న సీఎం

Published on Thu, 03/21/2024 - 10:22

రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ప్రచార హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అయితే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

గోలఘటి నియోజకవర్గంలోని కంచమాల గ్రామ పంచాయతీలో సీఎం మాణిక్‌ సాహా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతూ కనిపించారు . 

2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో తిప్రా మోతా పార్టీకి చెందిన మనబ్ దెబ్బర్మ గోలఘటి నియోజకవర్గం నుండి గెలుపొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా సీపీఎం, కాంగ్రెస్ , గణ మంచ్, ఆల్ త్రిపుర పీపుల్స్ పార్టీ, సీపీఐ, సీపీఐఎంఎల్‌ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమి కింద పొత్తు పెట్టుకోవడానికి చేతులు కలిపాయి.

ఏప్రిల్ 19న నిర్వహించే మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  త్రిపురతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్‌లకు మార్చి 27ను నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటిచింది. నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది.

Videos

Gold: మళ్లీ పెరిగిన బంగారం తులం ఎంతంటే..?

15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్

DSC స్కాంలో కీలక పాత్ర ఎంపీ భరత్ ది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

DSC స్కాం పార్ట్ 2.. వెలుగులోకి కీలక ఆధారాలు

DSC స్కాంలో తవ్వేకొద్ది అక్రమాలు.. ఒక్కొక్కటి బయటపడుతుంటే బాబుకు బీపీ పెరుగుతోంది

శ్రీవారిని దర్శించుకున్న వెల్లంపల్లి

స్థానిక ఎన్నికల్లో ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే

బొల్లారం కేసులో బిగ్ ట్విస్ట్.. అధికారులే దొంగలు

Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

పక్కా ప్లాన్ తోనే గేమ్ లోకి దిగింది! ఆ ఒక్కటి జరిగితే.. నందన ఎప్పటికీ కనిపించదు..

Photos

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)