తృణమూల్ కాంగ్రెస్‌ ఆ పార్టీకి కాపీ.. త్రిపుర సీఎం

Published on Sat, 04/06/2024 - 15:49

అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. 

దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు.

బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.

Videos

టీడీపీ ఆఫీస్ కు దస్తగిరి.. బాబును కలవడం వెనుక ట్విస్ట్..

కురుక్షేత్రానికి సిద్ధం కండి.. క్యాడర్ కు జగన్ బిగ్ టాస్క్

DSCలోనే కాదు.. ఫేక్ సర్టిఫికెట్లతో మెడికల్ సీట్లు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ లోకేష్.. DSC స్కామ్ జరిగింది.. ఇవిగో ఆధారాలు

ఆవేశం పడకు చెల్లమ్మ... మీలాగ విశ్వాసం లేని కుక్కలం కాదు

మేమేమైనా చేతులు కట్టుకున్నాం అనుకుంటున్నావా... వేమిరెడ్డి దంపతులకు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్

నీ కొడుక్కి ఇంకా వత్తాసు పలికితే.. నువ్వు సీఎంగానే జైలుకి పోతావ్..!

అమలాపురం మున్సిపల్ కమిషనర్ ను అవమానించిన చంద్రబాబు

బాబుకు బిగ్ షాక్.. DSC స్కామ్ లో పెద్ద తలకాయలు

Photos

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)