Breaking News

‘రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది’

Published on Sat, 08/16/2025 - 16:01

హైదరాబాద్:  తనకు మంత్రి పదవిని ఆశజూపి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలపై పదే పదే విమర్శల చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిఓణ కమిటీకి చేరింది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. 

సోషల్‌ మీడియా జర్నలిస్టులను టార్గెట్‌ చేసి మాట్లాడటం సీఎం రేవంత్‌కు తగదని,  దీన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు. ఈ విషయంపై పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ స్పందించారు. ‘ రాజగోపాల్‌రెడ్డి  ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించా. రాజగోపాల్ రెడ్డి వ్యవహరాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది’ అని స్సష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.  బీసీ రిజర్వేషన్ల విషయం లో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. ఇక మార్వాడీలు గో బ్యాక్‌ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై మహేష్‌ గౌడ్‌ స్పందించారు. మార్వాడీలు మనలో ఒక భాగమని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు.

మంత్రి పదవిపై ఉన్న మోజు అభివృద్ధిపై లేదు
యాదాద్రి భువనగిరి జిల్లా:  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న మోజు నియోజకవర్గం అభివృద్ధిపై లేదని విమర్శించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.  ‘ 20 నెలల్లో మునుగోడులో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మేమే. ప్రభుత్వం సహకరిస్తలేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక్కసారైనా నియోజకవర్గం తీసుకొచ్చావా. మునుగోడుకు రాజగోపాల్ నేనే మంత్రి.. నేనే రాజు అని అనుకుంటున్నాడు. మంత్రులను ఎంపీలను ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నాడు..కలలో కూడా మంత్రి పదవి కోసం రాజగోపాల్ కలవరిస్తున్నాడు. మంత్రి పదవి ఫై ఉన్న మోజు ఈ ప్రాంత అభివృద్ధిపై లేదు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్నే విమర్శిస్తే నీకు నిధులు ఎవరు ఇస్తరు’ అని ప్రశ్నించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)