Breaking News

అధికారులకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ వార్నింగ్

Published on Thu, 03/13/2025 - 20:09

సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.

‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్‌ గౌడ్‌ చెప్పారు.

అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్‌ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి  ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్‌ గౌడ్‌ దుయ్యబట్టారు.

‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)