Breaking News

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు

Published on Wed, 01/08/2025 - 18:40

న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ  బుధవారం(జనవరి 8) ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. 

ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. తృణమూల్‌ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్‌ చేరడం గమనార్హం. ఇప్పటికే  సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్‌ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. 

ఇదీ చదవండి: రమేష్‌ బిదూరిపై బీజేపీ చర్యలు 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)