Breaking News

స్పీకర్‌ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !

Published on Tue, 06/25/2024 - 18:51

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ పదవికి  అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్‌ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్‌ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఆరోపిస్తోంది. 

స్పీకర్‌ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్‌25) మీడియాకు తెలిపారు. 

‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్‌ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్‌ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా, 18వ లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక బుధవారం(జూన్‌26) జరగనుంది. స్పీకర్‌ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను  బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్‌ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్‌ చేయకపోవడంతో స్పీకర్‌ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)