Breaking News

‘పరిటాల సునీత కనుసన్నల్లోనే లింగమయ్య హత్య’

Published on Mon, 03/31/2025 - 17:54

తాడేపల్లి :  ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురబ లింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎ‍స్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్, ఎస్పై సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవటానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాస్ రెడ్డి.. ఎస్పై సుధాకర్ తన ఫోన్ నుంచే పరిటాల సునీత, శ్రీరామ్ లకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీలసీ కిడ్నాప్ చేయించటానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికొక వైఎస్సార్ సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద రెండు రోజుల పాటు దాడులు చేశారన్నారు.

‘కురుబ లింగమయ్యను దారుణంగా కొట్టి హతమార్చారు. టీడీపీ గూండాలు ఆదర్శ్, మనోజ్, నర్సింహా, నవకాంత్, రమేష్, సురేష్ లే ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఐతే పోలీసులు మాత్రం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారు. చివరికి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించటం లేదు’ అని తోపుదుర్తి పేర్కొన్నారు.

	Thopudurthi Prakash: సునీత డైరెక్షన్‌లో లింగమయ్య హత్య

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)